త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులను అరెస్టు చేయడం సరికాదు…

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  …
భువనగిరి, జనం సాక్షి
త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులను మంత్రి వస్తున్నారని కారణం చేత ఉదయం వారి ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేయడం సరి అయింది కాదని అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం  అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.  భువనగిరి పోలీస్ స్టేషన్ కు వేళ్లి భూ నిర్వాసితులకు మద్దతు తెలిపారు,ఆయన
మాట్లాడుతూ రాయగిరి గ్రామం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉందని త్రిబుల్ ఆర్ రింగురోడ్డు భువనగిరి అనుకొని ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం గుండా వెళ్లడం సరైనది కాదన్నారు. గతంలో విద్యుత్తు లైను, కాలేశ్వరం ప్రాజెక్టు కాలువలు, జాతీయ రహదారిలో భూములు కోల్పోయారని ప్రస్తుతం త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు ఈ గ్రామం గుండా పోవడంతో సుమారు 300 నుంచి 400 ఎకరాలు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తన సొంత భూమి పోతుందనే ఉద్దేశంతో త్రిబుల్ ఆర్ భూమి అలైన్మెంట్  మార్చారని ఆరోపించారు.