త్వరలోనే పేదలకు డబుల్ ఇళ్లు: ఎమ్మెల్యే
వరంగల్,జూలై13(జనం సాక్షి): పేదలకు తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించి డిసెంబర్ నెలవరకు లబ్దిదారులకు అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం చర్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న డబుల్ బెడ్ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తామని అన్నారు .చెర్లపల్లి గ్రామంలో 76 ఇండ్ల నిర్మాణం జరుగుతుందని కొన్ని సాంకేతిక లోపాలవల్ల పనులలో జాప్యం జరుగుతుందని అయిన అన్నారు. అధికారులతో మాట్లాడి పనులను తొందరగా పూర్తి చెసేవిధంగా చర్యలను తీసుకుంటామని అన్నారు.