త్వరలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వే

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం కు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున మావల మండలం బట్టి సావర్గాం పరిధిలో గల 28.37 ఎకరాలు రాజీవ్ స్వగృహ ప్లాట్లను బహిరంగవేలం వేయడానికి డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అనుమతులు రావడం జరిగిందని, త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ప్లాట్లలో అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ లే అవుట్ లో 362 ప్లాట్లు ఏర్పాటు చేశామని, అంతర్గత పనులు మరో పది రోజుల్లోగా పూర్తిచేసి బహిరంగ వేలం చేపడతామని పేర్కొన్నారు. లే అవుట్ లో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ కి సూచించారు. ఈ కార్యక్రమం లో  అర్డీ వో  రమేష్ రాథోడ్, మావల తహసీల్దార్ వనజ రెడ్డి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కిరణ్, మున్సిపల్ డిప్యూటీ ఈఈ తిరుపతి, తదితరులు ఉన్నారు.