దండేపల్లి ని సందర్శించిన జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి
దండేపల్లి .జనం సాక్షి.జులై 27 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం లో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పెట్టిన చెట్ల బుట్టలు విరిగిపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్లను పెంచే బాధ్యత గ్రామపంచాయతీ అని అన్నారు ప్రతిరోజు గ్రామ సిబ్బంది తోపాటు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో ఉండాలని హెచ్చరించారు అనంతరం మండల కేంద్రంలోని తాళ్లపేట ఉన్నంత పాఠశాలను పర్యవేక్షించి పాఠశాల వసతులను పాఠశాలలో గ్రౌండ్ మరుగుదొడ్లు వివిధ సమస్యల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలకు ఏవైనా సమస్యలు వస్తే పై అధికారులకు రిపోర్ట్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు