దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలి
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కృష్ణ,
ఖానాపురం జూలై 29జనం సాక్షి
లేబర్ కోడ్లను ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి
కనీస వేతనం రూపాలు 26000 అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈనెల 31వ తేదీన హైదరాబాదు లోని ఉస్మానియా యూనివర్సిటీ లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో దక్షిణాది రాష్ట్రాల సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సును అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆరెల్లి కృష్ణ పిలుపు ఇచ్చారు. శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంలో సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల వైఖరిని చేపట్టిందని దేశంలోకి పరిశ్రమలు రావడానికి చట్టాలు కఠినంగానూ సంక్లిష్టంగాను ఉన్నాయని వాటిని మార్చవలసిన అవసరం ఉందని 2015 సంవత్సరంలో ప్రకటన చేశాడని ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వర్గాలకు సానుకూలంగా కార్మిక చట్టాల్లో సమూల మార్పులకు పూనుకున్నాడని విమర్శించారు.
ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభిస్తారని వక్తలుగా కర్ణాటక హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కామ్రేడ్ బాలన్ ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు టి యు సి ఐ జాతీయ నాయకులు మానసయ్య కామ్రేడ్స్ సుష్మ వర్మ కామ్రేడ్ సతీష్ ఎస్ డబ్ల్యూ సి తమిళనాడు ఎస్ డబ్ల్యూ సి సి పశ్చిమబెంగాల్ కామ్రేడ్ సురేష్ కుమారి జేఎస్ఎస్ హర్యానా కామ్రేడ్ సిద్ధాంత రాజ్ ఐ ఎఫ్ టి యు ఢిల్లీ కామ్రేడ్ అమిత్ ఎం ఎస్ కే ఢిల్లీ కామ్రేడ్ మోహిత్ ఎం ఎస్ ఎస్ యు పి కామ్రేడ్ సంతోష్ కుమార్ కామ్రేడ్ రఘువీర్ సింగ్ హర్యానా కామ్రేడ్ ప్రజాని కామ్రేడ్ అమృత తమిళనాడు మోహన్ ఏపీ విప్లవ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొత్తూరు రవి,కనుకుల రాజు, మల్లె పోయిన రమేష్,తోట సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.