దళితుల పట్ల సీఎం వివక్ష: శంకర్రావు

కరీంనగర్‌, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్‌ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని  ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే తనపై సీఎం అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హోంమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.