దళిత బంధు లబ్ధిదారులు ఎంచుకున్న పథకం, యూనిట్ గ్రౌoడింగ్ పనులు పర్యవేక్షించాలి

సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్
హన్మకొండ బ్యూరో 26ఆగస్టు జనంసాక్షి
దళిత బంధు ద్వారా లబ్ధిదారులు ఎంచుకున్న పథకం అమలు పర్యవేక్షచాలన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్.
శుక్రవారం నాడు హనుమకొండ, కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో  దళిత బంధు పథకం రాష్ట్ర సలహాదారు లక్ష్మా రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, లతో కలిసి లబ్దిదారులకు లాభాసాటి వ్యాపారం కోసం దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు, సెర్ఫ్ ప్రతినిధులు వివిధ రంగాలలో లాభాలు ఆర్జించే వ్యాపారం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అని అన్నారు. వారు ఎంచుకున్న పథకం అమలు, లాభసాటి వ్యాపారం కోసం అధికారులు, లబ్దిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.
వివిధ శాఖల ద్వారా లబ్దిదారులకు యూనిట్లు (పథకాలు) నుండి అధిక లాభాలు ఆర్జించే వ్యాపార నిర్వహణ చూడాలని సుమారు పదిహేను వందల యూనిట్లలో లబ్దిదారులకు కేవలం ట్రాన్స్ఫర్ట్ కాకుండా ఇతర లాభసాటి వ్యాపారలపై దృష్టి పెట్టీ చర్యలు తీసుకుంటామని  అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత బంధు పథకం రాష్ట్ర సలహాదారు లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, లతో పాటు డిక్కీ సంస్థ ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, దళిత బంధు ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

తాజావార్తలు