దాయాది హతాఫ్-7 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 రోజుల్లో పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలు చేయడం దీంతో ఐదో సారి. ఇది పాకిస్తాన్ జాతీయ భద్రతను పటిష్టం చేయగలదని, కీలక నిరోధకంగా ఉండగలదని పాక్ సైన్యం ప్రకటించింది. ఇందులో బహుళ గొట్టాలు కల క్షిపణి వ్యవస్థ ఉందని తెలిపింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ భూ ఉపరితలాన్ని ఛేదించగలదని పాక్ శాస్త్రవేత్తలు వెల్లడించారు