దారుణంగా పడిపోయిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : ప్యాసింజెర్ వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఆగస్టు నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 31.57 శాతం పడిపోయినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్(ఎస్‌ఐఏఎం) తన డేటాలో పేర్కొన్నది. వరుసగా పదవ నెల కూడా అమ్మకాలు తగ్గినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమని ఆటో ఇండస్టీ
నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 2 లక్షల 87 వేల 198 వాహనాలు అమ్ముడుపోయాయి. కానీ ఈసారి కేవలం లక్షా 96 వేల 524 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయినట్లు అంచనా వేశారు. స్వదేశీ కార్ల అమ్మకాల్లోనూ భారీ తగ్గుదల కనిపించింది. ఆగస్టు 2018లో లక్షా 96 వేల 847 కార్లు అమ్ముడుపోయాయి. కానీఈసారి మాత్రం లక్షా 15 వేల 957 మాత్రమే అమ్మారు. 1997-98 నుంచి ఇంత దారుణంగా అమ్మకాలు ఎప్పుడూ పడిపోలేదని ఆటో ఇండస్టీ తన రిపోర్ట్‌లో చెప్పింది.