దీనధయాళ్ ఉపాధ్యాయ జీవితం స్పూర్తి దాయకం.

తొర్రూర్ 25 సెప్టెంబర్( జనంసాక్షి )
బీజేపీ పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ పండిట్ దీనధయాళ్ ఉపాధ్యాయ గారి 106వ జయంతి సందర్భంగా ఈరోజు తొర్రూర్ లో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ బీజేపీ నేటి పటిష్ట స్థితికి కారణభూతుడైన పండిట్ దీనధయాళ్ ఉపాధ్యాయ  జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయమని తెలిపారు.చిట్టచివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలన్న అంత్యోదయ సిద్దాంతాన్ని ప్రభోదం చేసిన దీనధయాళ్ ఉపాధ్యాయ ఆశయానికనుగుణంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ గారు పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు అని తెలిపారు.వాజ్ పేయి, అద్వానీ లాంటి ఉత్తమ నాయకులను పార్టీ కి అందించి నేటి పటిష్ట స్థితికి కారణభూతుడని కొనియాడారు.ఈకార్యక్రమంలో బీజేపీ,బీజేవైఎం నాయకులు తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్,బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్, ఎస్సీ మోర్చ అర్బన్ అధ్యక్షుడు మంగళపళ్ళి యాకయ్య,బీజేవైఎం రూరల్ మండలం అధ్యక్షుడు శేఖర్,కొండ రాజు, సిద్దు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.