దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
మండలం పరిధిలోని శేర్ఖాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచి లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. గ్రామస్తుల సహకారం,దాతల సహాయంతో ఆలయ నిర్మాణం పనులు స్లాబ్ దశ వరకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.నిర్మాణం పూర్తయ్యేందుకు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని వారన్నారు.కాబట్టి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమవంతు సహాయాన్ని అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఉప సర్పంచి ప్రభాకర్,ఆలయ కమిటీ చైర్మన్ సుదర్శన్ గౌడ్,బిసి సంఘం గ్రామ అధ్యక్షుడు దశరథ,మన్నె శ్రీనివాస్,వడ్ల వీరేశ్ చారి, లింగం గౌడ్,మల్లేశం,కృష్ణ,స్వామి,సాయి లు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.