దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న చీఫ్‌ వివ్‌ గండ్ర

శాయంపేట: వరంగల్‌ జిల్లా శాయంపేట మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. దుంపల రంగారెడ్డి అనే రైతుకు చెందిన అరటి తోట, కొత్త ఇంద్రా రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులను పరామర్శించారు. రైతులను అదుకోవడంతోపాటు వచ్చే ఏడాది నుంచి అరటి తోటలకు ఇన్సురెస్స్‌ కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.