దేవాదులతో ఆనాడు చెరువులు ఎందుకు నింపలేకపోయారు

రైతుబంధుతో కాంగ్రెస్‌ కుళ్లుకుంటోంది
వారం రోజులుగా సజావుగా సాగిన రైతుబంధు: ముత్తిరెడ్డి
జనగామ,మే18(జ‌నం సాక్షి ): గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తన హయాంలో దేవాదుల ద్వారా గ్రామాల్లో చెరువులను ఎందుకు నింపలేకపోయారో చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఒక్క సిఎం కెసిఆర్‌ వల్‌ల మాత్రమే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఎఉగువన ఉన్న జనగమా జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల కారణంగా చెరువుకలు జలకళ వచ్చిందన్నారు. గత వరాం రోజులుగా రైతుబందు చెక్కుల పంపిణీ జోరుగా సాగిందన్నారు. ప్రతి గ్రామంలో చెక్కలు పంపిణీ చేపట్టామని అన్నారు. మిగిలిన వారికి కూడా అందచేస్తామని శుక్రవారం నాడిక్కడ అన్నారు.
సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రైతుల మోములో ఆనందం తాండవిస్తోందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా రైతులకు పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్‌ అందిస్తున్నారన్నారు. రైతులంతా ఎంతో సంతోషంగా చెక్కులను తీసుకెళుతుంటే ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి
పోతోందని, ఎటు పాలుపోక రైతులను అవహేళన చేస్తున్నాయనాని మండిపడ్డారు. రైతులను విమర్శిస్తే ఆ పార్టీలకు పుట్టగతులుండవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధుతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కన్పిస్తుంటే కాం/-గరెస్‌ తట్టుకోలేక పోతోందని అన్నారు. రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణ రైతుల బాగు కోసం దీనిని ప్రవేశపెట్టారన్నారు. ఆడుగంటి పోయిన చెరువులను నేడు ప్రభుత్వం గోదావరి జలాలతో నిండుకుండలా మారుస్తోందన్నారు. గతంలో గ్రామాల్లో తాగునీరు దొరకడం కష్టంగా ఉండేది, ఇప్పుడు మిషన్‌ భగీరథతో ఇంటింటికీ శుద్దమైన నీరు అందుతోందన్నారు. రైతులకు చెక్కులు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులకు కండ్లు మండుతున్నాయన్నారు.  పొన్నాల లక్ష్మయ్య ఏనాడైనా జనగామను పట్టించుకున్నారా ?.. అని ప్రశ్నించారు. ఎండకాలంలోను గోదావరి జలాతో చెరువులు, కుంటలు నింపిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో ప్రభుత్వ ధవాఖానకు రావాలంటే భయపడేవారని, కానీ నేడు వస్తున్నారని అన్నారు. 70ఏళ్లల్లో జరగని అభివృద్ధి నాలుగేండ్లలో జరిగిందన్నారు. దేశంలో నెంబర్‌ వన్‌గా సీఎం కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ది చేస్తున్నారని అన్నారు. రైతన్నకు మనోధైర్యం కల్పించేందుకే రైతు బంధు పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు.