దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తా
నూతన చైర్మన్ కొంక జనార్ధన్
వెంకటాపూర్ (రామప్ప) జనంసాక్షి ; పాలంపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడతానని నూతన చైర్మన్ కొంక జనార్ధన్ అన్నారు సోమవారం స్థానిక సర్పంచ్ డోళి రజిత శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో దేవాలయ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఉపాధ్యక్షులుగా మోత్కూరి శ్రీనివాస్ కార్యదర్శిగా మార్కరాజు సభ్యులుగా భిక్షపతి నాగేశ్వర్రావు రత్నాకర్ మహేష్ నవీన్ సమ్మయ్య రజినీకర్ స్వామిలను ఎన్నుకున్నట్లు సర్పంచ్ డోళి రజిత శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ దేవాలయ అభివృద్ధి కోసం సుమారు యాభై వేల రూపాయల నిధులు సమకూర్చినట్లు తెలిపారు