దేవాలయ భూములకూ రైతుబంధు చెక్కులు ఇవ్వాలి: పొన్నాల డిమాండ్‌

జనగామ,మే14(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కులను దేవాదాయ భూములకు కూడా ఇవ్వాలని పిసి మాజీచీఫ్‌, కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  డిమాండ్‌ చేశారు. దేవాలయ భూములకు దేవుడి పేరువిూద ఇవ్వడం ద్వారా ఆలయాను పరిపుష్టం చేసినట్లుగా ఉంటుందన్నారు. అలాగే కైలురైతుకు కూడా పెట్టుబడి సాయం అందించాలన్నారు.కౌలు రైతులు, దేవాలయ భూములకూ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అయితే పథకాలకన్న ప్రచారం విూద టిఆర్‌ఎస్‌ ఎకక్కువగా ఫోకస్‌ చేస్తోందని  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది పథకాల విూద కానీ.. ప్రచారం విూద కాదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పగా చెప్పుకుంటోందని, 4 విడతల్లో రుణమాఫీ చేయడం వలన రైతులపై వడ్డీ భారం పడిందన్నారు. ప్రభుత్వమే ఈ వడ్డీని చెల్లించాలని పొన్నాల డిమాండ్‌ చేశారు. సోమవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన పొన్నాల.. 24 గంటల కరెంట్‌ వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు పంట నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. ఇటీవల వడగళ్ళు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ మేరకు పంటలను కొనుగోలు చేయాలన్నారు.