దేవాలయ భూముల స్వాధీనం పెరుమాళ్లకే ఎరుక
వరంగల్,మార్చి26 (జనంసాక్షి) : వరంగల్ జిల్లాలో అనేక దేవాలయాల భూములు కబ్‌ంజాకు గురైనా, ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్నా పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాల్లో దేవుడి మాన్యాలను కౌలు పేరుతో తీసుకుని పట్టాలు చేచించుకున్నా అధికారులకు చీమకుట్టినట్లు లేదు. సిఎం కెసిఆర్ దేవాలయ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పినా ఎక్కడా ఎకరా భూమి స్వాధీనం కాలేదు. వరంగల్ నగర నడిబొడ్డున హన్మకొండ ప్రాంతంలోని మచిలీబజార్‌లో ఆంజనేయుడి దేవస్థానానికి చెందిన 1 ఎకరం 20 గుంటల స్థలం అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దేవాలయానికి చెందిన భూములలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టారు. భద్రకాళీ చెరువు గట్టున శ్రీ శివసహిత కార్యసిద్ది ఆంజనేయ స్వామి దేవాయలయం ఉంది. పూర్వ కాలంలో దేవస్థానానికి 1 ఎకరం 20 గుంటల స్థలాన్ని ఇనాంగా ఇచ్చారు.గతంలో ఈ స్థలంలో వ్యవసాయం చేసేవారు. వ్యవసాయ కౌవులు ద్వారా వచ్చిన ఆదాయంతో దేవాలయానికి దూపదీప నైవేద్యాలు పెట్టేవారు. పదేళ్ల క్రితం వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. 2010లో భద్రకాళీ, హన్మకొండల మధ్య రోడ్ల నిర్మాణం ఈ స్థలాల మధ్య నుంచి చేశారు. దీంతో ఈ ప్రాంతంలో వెలుగులోకి రావడంతో ఖరీదైన ప్రాంతంగా ఉండడంతో కభ్జాదారులు కన్నేశారు. ప్రైవేటు వ్యక్తులు స్థలం మాదంటూ రిజిస్టేష్రన్‌లు చేసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. . కాకతీయ పట్టణాభివృద్ది సంస్థలో సైతం దస్తాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏదీ తేలచ్చకముందే నిబంధనలకు నిళ్లు వదిలి అక్రమ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీనిపై దేవాలయ నిర్వాహణ కమిటీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుని భూములు కబ్జాకు గురవుతున్నాయని వారు చెబుతున్నారు. కబ్జా చేసిన వ్యక్తి సైతం దర్జాగా కాగితాలు చూపిస్తూ స్థలం నాదే అంటున్నాడు. ఈ స్థల వివాదంపై రెవెన్యూ, కూడా, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు సర్వే నిర్వహించి తమకు అప్పగించాల్సి ఉందని, ఎట్టి పరిస్థితులలో దేవాలయ భూముల అక్రమణలు గురికాకుండా అడ్డుకుంటామని దేవాదాయ శాఖ అధికారి చెబుతున్నారు. ఇక బచ్చన్నపేటలో ఉన్న శ్రీచెన్నకేశవ స్వామి దేవాలయానికి దండిగా భూములు ఉన్నా ధూపదీప నైవేద్యానికి నోచుకోవడం లేదు. వివిధ ప్రాంతాలోల కనీసం 40 ఎరాలకు పైగా ఉన్నా అవి అన్యాక్రాంతం అయ్యాయి. వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్తలు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వీటిపై ఫిర్యాదు చేసినా అధికారులు ముందుకు రావడం లేదు. కబ్జారాయుళ్లు దర్జాగా ఉల్టా కౌలుకు ఇచ్చుకోవడం లేదా పట్టాలు చేసుకుని అమ్ముకోవడం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.