దేశంలో పదివేలకు తగ్గిన కరోనా కేసులు
న్యూఢల్లీి,నవంబర్6 ( జనం సాక్షి ): దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.
కరోనాతో మరో 392 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.43కోట్లకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,60,265మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 12,509 మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3.37కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,46,950 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో 252రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 107.92కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.