దేశంలో 14,348 కొత్త కరోనా కేసులు
దిల్లీ: దేశంలో కరోనా కేసుల నమోదు, మరణాలను నిన్నటితో పోలిస్తే స్పల్ప పెరుగుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 14,348 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి కారణంగా 805 మంది మరణించారు. కరోనా బారి నుంచి మరో 13,198 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,61,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.19 శాతంగా ఉందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 104.82 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు బులెటిన్‌లో పేర్కొంది.