దేశంలో 30వేలకు దిగువన కరోనా కేసులు
న్యూఢల్లీి,సెప్టెంబర్27(జనంసాక్షి) దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయి. 276 మంది మృతి చెందగా.. 29,621 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,36,78,786కి చేరగా.. 4,47,194 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,29,31,972 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,99,620 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86,01,59,011 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడిరచింది.