దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన
మహమనీషి వివేకానందుడు
హైదరాబాద్: భారతదేశ గొప్పతనాన్ని, హిందూమత విశిష్ఠతను ప్రపంచానికి చాటిన వివేకానందుడు గొప్ప వ్యక్తి అని భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి కొనియాడారు.ఆయన స్ఫూర్తితో యువత లక్ష్యసాధనకు, సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానుందుడి కార్యదీక్ష, సామాజిక స్ఫృహ యువతను పెడదారి పట్టాకుండా చేస్తాయని చెప్పారు. నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద కళాశాలలో జరిగిన వివేకానందుడి 150వ జయంత్యుత్సవాల్లో కిషన్ రెడ్డి అతిధిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివేకానందుడి జయంత్యుత్సవాలను ప్రజలు జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమాన్నారు.