దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలి.

జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ. జనం సాక్షి
బీసీ ల ఆశాజ్యోతి,బహుముఖ ప్రజ్ఞాశాలి,మేధావి,జాతీయ ఓబీసీ కమిషన్ మొదటి చైర్మన్,
సామాజిక న్యాయ తత్వవేత్త,
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో బీసీల రిజర్వేషన్లకు కారకుడైన బిపి మండల్ 104 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బిపి మండల్ మండల్ కమిషన్ చైర్మన్ గా బీసీల న్యాయమైన రిజర్వేషన్ల కోసం ఆమోఘ కృషి చేసినాడు.విద్యా ఉద్యోగాల్లోనూ,చట్టసభల్లోనూ
ఆర్ధిక రాజకీయ రంగంలోనూ
బీసీలు తమ పూర్తి వాటా పొందేంతవరకూ బీసీలకు విముక్తి లేదని స్పష్టంగా ఎలుగెత్తినవాడు.అందుకోసం జీవితాంతం పోరాడిన యోధుడు  బీపీ మండల్
ఈ దేశంలో బీసీలు ఈ మాత్రమన్నా ఆర్థికాభివృద్ధి ని సాధించి ఒక స్థాయిలో ఉండటానికి కారకుడు బి.పి మండల్.అలాంటి మహోన్నత మనిషిని స్మరించుకోవడం మన కనీస భాద్యత అని అన్నారు.రిజర్వేషన్ల వ్యతిరేకులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకొని బీసీల హక్కుల కోసం కృషి చేసిన మహానుభావుడని ఆయన సేవలను కొనియాడారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీల గణన జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు .ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,రవి,ఎర్రబెల్లి దుర్గయ్య,చేగొండి మురళి యాదవ్,దాసరాజ్ జయరాజ్,కుమ్మరికుంట్ల సుధాకర్,దశరథ నాయక్,కవిత,మహేష్ తదితరులుపాల్గొన్నారు