దొంగ అరెస్ట్: నగదు స్వాధీనం
జయశంకర్ భూపాలపల్లి,జూలై10(జనం సాక్షి ): జయశంకర్ భూపాలపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న దొంగను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బైరి శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 39,500ల నగదు, విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పాల్వంచలో దొంగతనాలకు పాల్పడుతున్న బాల నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల నేరస్తుడి నుంచి రూ. 4.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
—————