దొంతి నుంచి దంతాన్ పల్లికి డబుల్ రోడ్డు
ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితులకు డబుల్ బెడ్ రూం లు
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : దొంతి నుంచి మండల పరిధిలోని దంతాన్ పల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శబాష్ పల్లి, దొంతి, గుండ్లపల్లి, కొంతాన్ పల్లి, గుండ్లపల్లి గ్రామాలలో 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2 వందలు ఉన్న పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచి సమాజంలో వృద్దులకు, వికలాంగులకు విలువలను పెంచిందన్నారు. కొంతాన్ పల్లి గ్రామంలో ఆర్ఆర్ఆర్ రోడ్డు, కాలేశ్వరం కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు తప్పకుండా ప్రభుత్వం నుండి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాలలో అర్హులుగా ఉండి పెన్షన్ రాని వారందరికీ తప్పకుండా పెన్షన్లు ఇప్పిస్తానని చెప్పారు. గుండ్లపల్లి భూముల సమస్యలు పరిష్కరిస్తామని, దొంతి గ్రామానికీ కరెంట్ సమస్యలు లేకుండా ఉండేందుకు చిన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను అతి త్వరలోనే నిర్మించేలా కృషి చేస్తామన్నారు. మనఊరు – మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుండి దొంతి ఉన్నత పాఠశాలకు నిధులు మంజూరు అయ్యాయని,అందులో నుండి పాఠశాలను అభివృద్ది చేయడమే కాకుండా కిచెన్ షేడ్, డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఉన్నత పాఠశాల గదుల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఉచితంగా సరఫరా అయిన యూనిఫాంలను ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ చారి, ఇంచార్జీ ఎంపిడిఓ తిరుపతి రెడ్డి, సర్పంచులు పార్వతి సత్యం, పణి శశాంక్ శర్మ, పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, గైనిబైటి శ్రీనివాస్ గౌడ్, కన్నారం దుర్గేశ్, పత్రాల శ్రీనివాస్ గౌడ్,బాబురావు, ఎంపీటీసీలు ఆకుల ఇందిరా శ్రీనివాస్, లక్ష్మీ కుమార్, లక్ష్మీ లక్ష్మణ్, ఉప సర్పంచులు వంచ శోభ, మొలుగు నాగేశ్వరరావు, పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పునూతల వెంకటేశ్ గౌడ్,సదానందం, తదితరులు పాల్గొన్నారు.