దోమ మండలకేంద్రంలో ఘనంగా వజ్రోత్సవాలు….
దోమ న్యూస్ జనం సాక్షి.
75సంవత్సరంల జాతీయ జెండా వారోత్సవాలు దోమ మండలకేంద్రంలో బుధవారం “దోమ గ్రామపంచాయతీ” ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల ఆవరణలో డెబ్భై ఐదు సంఖ్య అకృతి లో మొక్కలు నాటారు ఈ సందర్బంగా సర్పంచ్ కె రాజిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంకు స్వాతంత్రము వొచ్చి డెబ్భై ఐదు సమవత్సరాలు పూర్తి అయినందున వజ్రత్సవాలు ఘనంగా గ్రామ స్థాయిలో నిర్వహించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టత్మాకంగా నిర్వహించడం సంతోషించ దగ్గ విషయం అని ప్రతి ఇంట జెండా ఎగారావేసేందుకు గ్రామపంచాయతీ లో ఎంపీటీసీ బంగ్లా అనితయాదయ్య ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ లతో కలిసి జాతీయ జెండాలు పంపిణి చేసారు మొక్కలు నాటే కార్యక్రమం లో ఎంపీటీసీ అనిత ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ పాల్గొన్నారు జెండాలు అన్ని ఇళ్ల పై ఎగిరే విదంగా మహిళల ద్వారా కూడ కృషి చేస్తామని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొసనము జ్యోతి అన్నారు ఈ కార్యక్రమం లో భాగంగా గ్రాంతలా య డైరెక్టర్ యాదయ్య గౌడ్ ఐకేపీ సీసీ జంగయ్య వార్డ్ సభ్యులు నిరోషా రమేష్ నవీన్ సాయిలు మైను కేజీబీవీ ప్రిన్సిపాల్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు