ధర్మాన కమీటీ నివేదికను సమీక్షించిన సీఎం
హైదరాబాద్ : మంత్రి ధర్మాన ప్రసాదరావు కమీటీ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇవాళ సమీక్షించారు. కమిటీ చేసిన సిఫారసులపై పరిష్కరాలతక్ష ముందుకుయ రావాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు వీలుగా కోర్టు కేసుపై దృష్టి సారించాలని అడ్వకేట్ జనరల్‌ను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపుపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. లక్షింపేట ఘటనపై శ్రీకాకుళంలో కోర్టు ఏర్పాటుకు హైకోర్టును కోరాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. పసుపు, కుంకుమ, బాలికా విద్యా పథాకాల ప్రతిపాదన పరిశీలించాలని అధికారులను సీఎం కోరారు.