ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్
జనంసాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో దేవతామూర్తి, ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొన్నారు. ప్రతిష్టాపన ఉత్సవాలకు హజరైన జెడ్పీ చైర్మన్కు ఆలయ అర్చకులు, ఆలయ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయం వద్ద రూ. 7.60 లక్షల డిఎంఎఫ్టి నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక బావన పెంపొందుతుందని, యువత ఆధ్యాతికత వైపు మొగ్గు చూపాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.