నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరించుకో ని ప్రభుత్వ పాఠశాలకు పదివేలు అందజేత.

తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డి ఫల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ ముద్దుల కుతురు నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరిం చుకోని పాఠశాలకు తమవంతుగా పదివేల రూపాయలు అందజేశారు.శనివారం పాఠశాలో నందిని జన్మదిన వేడుకలు పాఠశాల విద్యార్థుల మద్య ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న ,కౌన్సిలర్ సాహుశ్రీలత హాజరై నందినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న మాట్లాడుతూ
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, చదువులలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని మనసారా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రథానోపాద్యాయు లు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు ,తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొన్నారు.