నగరంలోకి ప్రవేశించిన మునుగోడు ఎమ్మెల్యే పాదయాత్ర
అబ్దుల్లాపూర్‌మెంట్: దిండి-నక్కలగండి ఎత్తిపోతల పథకానికి పరిపాలన ఆమోదం ఇవ్వాలని, శ్రీశైల సొరంగ మార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని సీపీఐ నేతృత్వంలో మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు చేపట్టిన పాదయాత్ర హయత్‌నగర్ మండలం కొత్తగూడెం మీదుగా నగరంలోకి ప్రవేశించింది. ఈ పాదయాత్ర బుధవారం అసెంబ్లీ వరకూ సాగనుంది. ఈ పాదయాత్రలో రైతు సంఘం నేతలు సత్యం, మందడి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.