నగరంలో వేడుకగా భోగి మంటలు
హైదరాబాద్: నగరంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేకువజామునే ప్రజలు భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, పద్మారావునగర్‌లో కట్టెలు, పాతవస్తువులు కుప్పగా పోసి భోగి మంటలు వేశారు. యువతీయువకులు, చిన్నాలు, పెద్దలు అంతా భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు.