నగరంలో హైడ్రామా
ఎస్పీని కిడ్నాప్ చేసిన హెచ్.సీ. అరెస్టు
హైదరాబాద్,సెప్టెంబర్ 12 (జనంసాక్షి):
పోలీస్ రవాణా సంస్థ (పిటీవో) లక్ష్మి నారాయణను సస్పెండైన హెడ్ కానిస్టేబుల్ నగరంలో సైఫాబాద్ ప్రాంతంలో నిర్భందిం చాడు. హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మ బుధవారం సాయంత్రం ఎస్పీని నిర్భదిం చాడు. హెడ్ కానిస్టేబుల్ గిరి ప్రసాద్ శర్మ బుధవారం సాయంత్రం ఎస్పీని నిరోధిం చాడు. ఆయన్ను విడుదల చేసేందుకు ప్రయత్నించిన పక్షంలో ఎస్పీని బంధించిన గదిని నిప్పు
పెడతానని శర్మ హెచ్చరించాడు. పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. పిటీవోకు చెందిన ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు తనను వేధింపులకు గురి చేసి సస్పెండ్ చేశారని, లక్ష్మీనారాయణ పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని శర్మ తన డిమాండ్లు ప్రస్తావించాడు. డిమాండ్లు పరిశీలిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ”నిష్పాక్షిక విచారణ జరుగుతుంది. ఎస్పీని వెంటనే విడుదల చేయాలని శర్మను కోరుతున్నాం. మేం అతడితో మాట్లాడుతున్నాం” అని ఆయన చెప్పారు. సంఘటనా స్థలి వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. హెడ్‌కానిస్టేబుల్ శర్మతో డీజీపీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలకు రంగం సిద్ధమైంది. హెడ్‌కానిస్టేబుల్ నిర్బంధం నుంచి ఎస్పీ లక్ష్మీనారాయణ విడుదలయ్యారు. డీజీపీ జరిపిన చర్చలు ఫలించడంతో ఎస్పీని తీసుకుని శర్మ బయటకు వచ్చాడు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.