నన్నో ఉగ్రవాదిగా చిత్రీకరించారు: ఆజంఖాన్‌ ఆవేదన

రాంపూర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించిన అనంతరం రాంపూర్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆజాంఖాన్‌ ర్యాలీలో కన్నీరు పెడుతూ ఉద్వేగంగా మాట్లాడారు. నన్ను జాతి వ్యతిరేకిలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిలా చూస్తున్నారు…పాలకులకు అధికారం ఉంది కాబట్టి నన్ను బహిరంగంగా కాల్చి చంపండి అంటూ ఆజాంఖాన్‌ వ్యాఖ్యానించారు. రాంపూర్‌ నగరంలో జరిగిన ర్యాలీలో ఆజాంఖాన్‌ మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఈసీ తనపై విధించిన నిషేధ సమయంలో తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఎవరినీ కలవలేదని, ర్యాలీలు, బహిరంగసభల్లో మాట్లాడలేదన్నారు. రాంపూర్‌ ను కంటోన్మెంటుగా మార్చారని, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.