నర్సంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు…
వరంగల్:నర్సంపేట మండలం సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదు.