నల్గొండ పట్టణం పచ్చదనం తో హరిత పట్టణం గా రూపొందించాలి

ఒక  రోజు పట్టణం లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పై సమీక్షించిన అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్  శ్రీ రాకేష్  మోహన్ డోబ్రియిల్   నల్గొండబ్యూరో,జనం సాక్షి. నల్గొండ పట్టణం పచ్చదనంతో  కనిపించేలా హరిత పట్టణంగా తీర్చిదిద్దాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్  రాకేష్ మోహన్ డోబ్రియిల్ అన్నారు. గురువారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శివాని డోగ్రే తో కలిసి పట్టణంలో ఒకరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పై అటవీ శాఖ,పురపాలన శాఖ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంను పచ్చదనంతో,సుందరంగా రూపొందించేందుకు ఒకరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి  మొక్కలు నాటేందుకు పట్టణంలో సైట్ లను గుర్తించినట్లు తెలిపారు. మొక్కలను ప్రోక్యూర్ చేయడం మొక్కలు, గుంతలు తీయడం, ఏ మొక్కలు నాటాలి,మొక్కలు నాటే విధానం పై అటవీ శాఖ మున్విపల్,ఇతర అధికారులకు సాంకేతిక పరంగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.ఒక రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పై అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి నుండి పర్యవేక్షిస్తూ అటవీ శాఖ అధికారులకు ఎప్పటి కప్పుడు సూచనలు చేస్తున్నారని అన్నారు.  ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతంలోనే కాకుండా పట్టణంలో ప్రతి కాలనీలో ఎక్కడ ఖాళీ ఉన్నా మొక్కలు నాటేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి కాలనీలో 100% మొక్కలు నాటి గ్రీనరీ వుండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.ప్రతి కాలనీ లో వార్డ్ మెంబర్లను, ఇన్చార్జ్ అధికారులను నియమించి సమన్వయంతో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. రహదారి మీడియన్ లో మొక్కలు నాటే ప్పుడు  డ్రిల్లింగ్ చేసి అటవీశాఖ అధికారుల సూచనలు  టెక్నికల్ గైడెన్స్ తో అనువైన మొక్కలు నాటాలని ఆయన తెలిపారు.  పట్టణం లో గుర్తించిన సైట్  లలో ఒక థీమ్ తో పూల మొక్కలను, అనువైన  మొక్కలు నాటి పట్టణం  అందంగా, పచ్చదనంతో కనిపించేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు  బ్లాక్ ప్లాంటేషన్  ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఓపెన్ స్థలంలో మొక్కలు నాటే ప్పుడు కచ్చితంగా మొక్కలకు రక్షణ గా ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. వర్షాలు లేవు కనుక మొక్కలు నాటిన నుంచి ప్రతిరోజు వాటరింగ్ చేయాలని, మొక్కలు పెరగడానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని, వాటికి జిప్సం,డి. ఏ.పి ఎరువు వేయాలని అప్పుడే మొక్క పెరుగుదల ఉంటుందని అన్నారు.                           జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒకరోజు లక్ష మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు, జిల్లా యంత్రాంగం తరఫున అటవీశాఖ, పురపాలన శాఖ, ఇతర శాఖల అధికారులు ప్రతి సైటు కు సైట్ ఇన్చార్జిగా నియమించినట్లు,  రెండు రోజుల్లో మొక్కలు నాటేందుకు గుంతలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రహదారుల మధ్య మీడియన్ లో, బ్లాక్ ప్లాంటేషన్ పాటు, పట్టణంలో ప్రతి కాలనీలో లక్ష  మొక్కలు నాటడమే కాకుండా పట్టణం లో కాలనీ లో ఖాళీ స్థలాల్లో అదనంగా మొక్కలు నాటేందుకు  ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లను, ప్రజాప్రతినిధులను సంప్రదించి అందరిని బాగ స్వామ్యు లను చేయాలని, పట్టణమును అందంగా సూచించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ జిల్లాలో పట్టణంలో రోడ్ల అభివృద్ధి వెడల్పు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 6 నెలల సమయం లో రహదారి అభివృద్ది,వెడల్పు పనులు పూర్తవుతాయని అన్నారు .పట్టణంలో మొక్కలు నాటేందుకు పది లోకేషన్లను గుర్తించినట్లు, పట్టణంలో రహదారులు 35 కిలోమీటర్ల నిడివి  ఉన్నాయని అన్నారు.మొక్కలు నాటుటకు ఎస్ఎల్బీసీ, ఎస్టీపి ఇతర ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   సమావేశం అనంతరం అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ రాకేష్ మోహన్ డొబ్రి యిల్,చీఫ్  కన్జ ర్వేటర్ శ్రీమతి శివాని డోగ్రే , జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అధికారులతో కలిసి మొక్కలు నాటే ప్రాంతాలను ఎస్ఎల్బీసీ, ఎస్టీపి ,ఇతర సైట్ లను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.