నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన.

గని మేనేజర్ కు వినతి పత్రం ఇస్తున్న కార్మికులు.
బెల్లంపల్లి, ఆగస్టు25, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో గురువారం టిజిబికెఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఫిట్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం శాంతిఖని గనిలో ఎస్డీఎల్ లను ప్రయివేటు పరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ తీసుకున్న ఈ మొండి నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా సెక్రటరీ సిహెచ్ వెంకట రమణ, జీఎం కమిటీ సభ్యుడు రాజనాల రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, మైనింగ్ స్టాఫ్, కార్మికులు పాల్గొన్నారు.