నష్ఠ పొయిన పంట పొలాలను పరిశీలించిన..
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..
జూలై (జనం సాక్షి): జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షల వలన దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మండలము లోని సాంగిడి,బేదోడ గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను కలెక్టర్ పరిశీలించారు.సాంగిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను కలెక్టర్ సందర్శించి గ్రామస్తులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బేదోడ గ్రామంలో వర్షల వలన గ్రామంలోకి పెన్ గంగ నీరు ప్రవేశించిన ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షల వలన లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు దెబ్బతిన్నాయని, నీటి నిల్వలు గ్రామాల్లోకి చేరాయని, నీటి నిల్వ వలన వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు.మండల కేంద్రము లోని తహసిల్దార్ కార్యాలయాన్ని, స్త్రీ శక్తి భవన్ లోకి బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మార్చనున్నందున ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసిల్దార్ రాంరెడ్డి, ఎంపిడిఓ రవీందర్, వివిధ శాఖల అధికారులు, ఎంపిపి వనితా గంభీర్ ఠాక్రే, సర్పంచ్ ఇంద్ర శేఖర్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు