నాంపల్లి కోర్టుకు మావోలు సానుభూతిపరులు

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిరాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న 15మందిని నగరంలోని ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా అరెస్టు చేశారు. వారిని ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.