నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది జిల్లా కలెక్టర్ నిఖిల

మోమిన్ పేట సెప్టెంబర్ 18(జనం సాక్షి)
మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు శనివారం మోమిన్ పెట్ మండలం మొరంగ్ పల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ మొరంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పెద్ద మొత్తంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా 3 వేల చెట్లను నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.   మొక్కలు నాటడం కార్పోరేట్ సామాజిక బాధ్యతగా గుర్తించి మూడు వేల మొక్కలను ఎస్బిఐ జిల్లా యంత్రాంగం తో కలిసి పనిచేయడం జరుగుతుందని ఆమె అన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మొక్కలు నాటుకొని వాటిని సంరక్షించుకోవాలని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు. వ్యవసాయ పొలాల దగ్గర గట్ల పైన కూడా చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గ్రామాల్లో ఉన్న దుకాణాల ముందు మొక్కలు నాటుకొని అవి పెద్దగా అయ్యేవరకు సంరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ప్రతి వార్డులో, గ్రామం  కూడలిలో గల రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచేందుకు గ్రామస్తులందరూ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో గ్రామ పరిసరాల్లో నాటిన మొక్కలను కాపాడుకోవలసిన బాధ్యతను గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కృష్ణన్,  జడ్పీ వైస్ ఛైర్మెన్ విజయ్ కుమార్,  స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపిపి మల్లయ్య మాజీ సర్పంచ్ లు మానయ్య నర్సింలు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కుమ్మరిగూడెం కృష్ణ వివిధ పార్టీల నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు