నాణ్యతతో పనులు చేపట్టాలి
జనం సాక్షి,వంగూరు:
మండల పరిధిలోని డిండి చింతపల్లి, ఉమ్మాపూర్ జిపిల పర్యటనలో భాగంగా బుధవారం సెంట్రల్ లెవెల్ టీం, జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అధికారి అనురాధ పర్యటించారు. తదుపరి ఉపాధి హామీ నిధుల నుండి అమృత్ సరోవర్ క్రింద పెద్ద చెరువు పూడిక తీసిన పనిని పరిశీలించి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చెరువు పనుల్ని మొత్తం అంచనా ప్రకారం పూర్తి చేసి నీటినిలువలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించి పల్లె ప్రకృతి భాగంలో మొక్కలు నాటారు. మరియు పి.వి.వి లో పండ్ల జాతి మొక్కలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ సభ్యులు ఎస్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ కె డి, సి డబ్ల్యూ ఎస్ హైదరాబాద్, జిల్లా డి ఆర్ డి ఓ అధికారులు నరసింహారావు, నటరాజ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీవో లక్ష్మయ్య, ఈసీ దేవేందర్, సర్పంచులు సరిత, ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.