నాణ్యమైన విత్తనాల సరఫరా

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): రైతాంగానికి నాణ్యమైన, తక్కువ వ్యయంతో విత్తనాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఏవో అనురాధ అన్నారు. గ్రావిూణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా ఖరీఫ్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం పంటను సాగు చేసిన వరిచేనును ఆమె పరిశీలించారు. పంటకు కొంత మేర అగ్గితెగులు వ్యాపించే అవకాశం ఉందని గుర్తించి దాని నివారణకు ఎకరాకు 120గ్రాముల ట్రై సైక్లోజోల్‌ను పిచికారి చేయాలని సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా చేనులో బెరుకులను ఏరివేసినైట్లెతే నాణ్యమైన విత్తనాలను తయారు చేయొచ్చని వివరిం చారు. పంటను కోసిన తరువాత విత్తనాలను పూర్తిగా ఆరబెట్టి బస్తాల్లో నింపి రైతులకు అందజేయొచ్చని సూచించారు. మూల విత్తనాలను మూడు పంటలకు వినియోగించుకొవచ్చని తెలిపారు.