నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
గద్వాల నడిగడ్డ, మార్చి 29 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయంలో బుధవారము నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 నూతన డైరీని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశు వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తూ , రైతులకు, పశుపోషకులకు అందుబాటులో ఉండాలన్నారు.కృత్రిమ గర్భధారణ ద్వారా పశుసంపదను కాపాడాలని, రైతులకు పశువుల యజమాన్య పద్ధతులు, వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి రైతులను చైతన్య పరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జోగులాంబ జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలు రమణమ్మ, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, కోశాధికారిణి ఉమాదేవి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.