నాలుగున మంచినీళ్లు బంద్..

హైదరాబాద్ : ఈనెల 4న నగరంలో పాక్షికంగా మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు పేర్కొంది. కృష్ణా తాగునీటి పథకం పనుల్లో భాగంగా సరఫరాను నిలిపివేయనున్నారు. నగర ప్రజలు ముందస్తుగా అదనంగా నీటిని పట్టుకోవాలని అధికారులు సూచించారు. 24గంటల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు.
2012 ఆగస్టులో చేపట్టిన కృష్ణా ఫేజ్ – 3 పనులు చివరదిశకు చేరుకున్నాయి. అక్కంపల్లి రిజర్వాయర్ కు ప్రధాన తాగునీటి పైపు లైన్ అనుసంధానం చేయాల్సి ఉంది. అందుకోసం 24గంటల పాటు కృష్ణా ఫేజ్ -1, ఫేజ్ – 2 నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. కృష్ణా ఫేజ్ – 3 పనులను జులై నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొదటి విడతగా 45 మిలియనన్ గ్యాలన్లు, రెండో విడతగా మరో 45 గ్యాలన్లు అందుబాటులోకి వస్తాయని అధికారి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది.