నాలుగేళ్లలో ఎన్నో విజయాలు

కెసిఆర్‌ సంకత్పమే అభివృద్దికి శ్రీరామరక్ష

విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొడతారు: బోడకుంటి వెంటకటేశ్వర్లు

వరంగల్‌,జూన్‌14(జ‌నం సాక్షి): తెలంగాణను సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని ఎమ్మెల్సీ, మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. నాలుగేళ్ల తక్కువ సమయంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనతను తెలంగాణ సొంతం చేసుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో మిగతా పనులన్నీ పూర్తి కాబోతున్నాయని అన్నారు. వీటిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌,బిజెపి నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే ఇవన్నీ వారికి ఎదురుతగిలి వారిని ప్రజల్లో మరింత చులకన చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా ఎదిగిందని దీంతో వారు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌దే పైచేయి అని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ది కోసం కెసిఆర్‌ నిరంతరంగా కృషి చేస్తన్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా భూ ప్రక్షాళన ఎవరూ చేపట్టిన దాఖలాలు లేవు. ఇన్నేళ్ల తరువాత టీఆర్‌ఎస్‌ సాహసోపేతమైన చర్య తీసుకుంది. దేశంలోనే ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా లేదు. ఒక్క తెలంగాణలోనే సాధ్యం అవుతున్నది. సీఎం సంక్షేమ కార్యక్రమాలు పల్లెపల్లెను తాకుతున్నాయి. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, పాస్‌ పుస్తకాలు అందజేయడం నిజంగా అద్భుతం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా భూమి సేద్యానికి యోగ్యంగా మారింది. కాళేశ్వరంతో ఆ కల తీరనుంది. గత పాలకులకు సాగునీటి అంశమే పట్టలేదని, దానిని గుర్తించి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాడక జల వనరులపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. నాటి నాయకుల అసమర్థతత, మేధావుల మౌనంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. స్వరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. మిషన్‌ కాకతీయ తదితర పథకాలతో వ్యవసాయానికి ఊపిరిలూదారు. ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా ప్రాజెకట్‌ఉలకు అనుమతులతో శరవేగంగా పూర్తి కావస్తున్నాయని అన్నారు. 57 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ జరుగుతున్నది. ఇప్పటివరకూ 42లక్షల మందికి పట్టాలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చి నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నది. రైతు ప్రయోజనాన్ని కోరుతూ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వ్యవసాయ విస్తరణాధికారుల నియామకాలు పెంచాం. భూసార పరీక్షలు చేయించాం. లక్ష మందికి పైగా భాగస్వాములను చేస్తూ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశాం. రైతు పండించిన

పంటకు ప్రభుత్వం ద్వారా మద్దతు ధర ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టి యంత్రాలను రైతులకు సబ్సీడీ ద్వారా అందజేస్తున్నాం. ఇందులో భాగంగా 10 వేల ట్రాక్టర్లను రైతులకు అందించాం. వరికోసే యంత్రాలను సైతం అందజేశాం. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యరంగాల ప్రగతికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని వివరించారు.