నాలుగోరోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన

నిలిచిపోయిన రైలు సర్వీసులు
సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని హెచ్చరిక
జైపూర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గుజ్జర్ల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. దీంతో తమకు నాయ్యం చేయకుంటే మరింత ఉధృతం చేస్తామని అన్నారు. మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించేంత వరకూ వెనక్కి మళ్లే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ మేరకు రాస్తారోకోతో రైళ్లు, దారిమళ్లించారు. రోడ్లపై
బైఠాయించి  ఆందోళన ఆపేది లేదన్నారు. ఇదిలావుంటే  జనం నా అదేశాల కోసం ఎదురుచూస్తున్నారని గుజ్జర్ల రిజర్వేషన్‌ పోరాటానికి సారథ్యం వహిస్తున్న అరక్షణ్‌ సంఘర్ష్‌ సమితి (జీఏఎస్‌ఎస్‌) నేత కేఎస్‌ భైంస్లా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్‌ డిమాండ్‌పై గుజ్జర్‌ కమ్యూనిటీ చేపట్టిన ఆందోళన సోమవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది. శాంతియుతంగానే ఆందోళన తెలపాలని, హింసకు పాల్పడవద్దని, చర్చలకు రావాలని ప్రభుత్వం తనకు చేసిన ప్రతిపాదనపై భైంస్లా విూడియాతో మాట్లాడుతూ ‘5 శాతం రిజర్వేషన్‌ తీసుకున్న తర్వాతే మేము వెనక్కి వెళ్తాం. రాజస్థాన్‌ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని వ్యక్తిగతంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు నా ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకుందాం. ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది’ అని అన్నారు. నాలుగోరోజు అందోళనలో భాగంగా దౌసా జిల్లాలో గుజ్జర్లు తమ ఆందోళన ఉధృతం చేశారు. జైపూర్‌ను ఆగ్రాతో కలిపి నేషనల్‌ హైవే-11ను ఆందోళనకారులు దిగ్బంధించారు. ధోల్‌ జిల్లాలో ఆదివారంనాడు గుజ్జర్ల ఆందోళనలో హింసాత్మక ఘటనలో చేటు చేసుకున్నాయి. కాల్పులు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ధోల్‌పూర్‌, కరౌలి జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించారు. గత శక్రవారం గుజ్జర్లు ఆందోళన చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి వరకూ 250కి పైళ్ల రైళ్ల రాకపోకలపై ఆ ప్రభావం చూపించింది. రాష్ట్ర టూరిజం మంత్రి విశ్వేంద్ర సింగ్‌, ఐఏఎస్‌ అధికారి నీరజ్‌ కె.పవన్‌తో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందం గత శనివారంనాడు ఆందోళనకారులతో చర్చలు జరిపినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడేంతవరకూ తాము ఆందోళన విరమించేది లేదని గుజ్జర్‌ నేతలు తెగేసి చెప్పారు.