నాసా మరో అంతరిక్ష విజయం
అంగారకుడిపై కాలుమోపిన ఇన్‌సైట్ ప్రోబ్
వాషింగ్టన్,నవంబర్27(జనంసాక్షి): నాసా మరో అంతరిక్ష విజయాన్‌ఇన నమోదు చేసింది. అంగారకుడిపైకి మరో రోవర్ విజయవంతంగా దిగింది. 300 మిలియన్ మైళ్ల దూరాన్ని ఏడు నెలల పాటు ప్రయాణించి నాసాకు చెందిన ఇన్‌సైట్ ప్రోబ్ అంగారకుడి విూద కాలుమోపింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట 30 నిమిషాలకు అరుణ గ్రహాన్ని చేరింది. గంటకు 12,300 మైళ్ల వేగంతో ఇన్‌సైట్ ప్రయాణం సాగింది. ప్రయోగం విజయవంతమైందని తెలియగానే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇన్‌సైట్ దిగిన ప్రాంతం పేరు ఎలీజియం ప్లానిషియా. ‘అంగారకుడి విూద అతి పెద్ద పార్కింగ్ ప్లేస్’ అని ఆ ప్రాంతాన్ని నాసా అభివర్ణిస్తుంది. ‘మొదటి సారి ఓ గ్రహం గురించి సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం లభించింది’ అని నాసా వెల్లడించింది. అక్కడ ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే తన పని మొదలు పెట్టింది. వెంటనే ఒక చిత్రాన్ని పంపించింది. ఈ ప్రాజెక్టు కోసం నాసా 814 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గ్రహానికి సంబంధించిన ఉపరితల, అంతర్భాగ పొరలను విూద ఇన్‌సైట్ ప్రోబ్ పరిశోధన నిర్వహిస్తుంది. దీని ద్వారా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ సౌర వ్యవస్థలో రాతి నిర్మాణాలు ఎలా ఏర్పడ్డాయో తెలిసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి ఇలాంటి మిజన్లను పంపించడం చాలా క్షిష్టమైన వ్యవహారం. ఇప్పటి వరకు అంతరిక్ష సంస్థల ప్రయోగాల్లో 40 శాతం మాత్రమే విజయం సాధించాయి. నాసా మాత్రమే ఈ విషయంలో విజయం సాధించింది.