నా రాజీనామా తోనే మునుగోడులో పరుగులు తీస్తున్న అభివృద్ధి..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ బ్యూరో.జనం సాక్షి.
ఎమ్మెల్యే గా గెలుపొంది గత మూడున్నర సంవత్సరాలుగా నమ్మి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోవడంతో తమ రాజీనామా తోనైన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని రాజీనామా చేయక ముందే అమిత్ షా ను కలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి గత ఏళ్ల తరబడి నుండి పెండింగ్లోలో ఉన్న గట్టుప్పల మండలం తో పాటు రాష్ట్రంలోని 12 మండలాలను ప్రకటించడం పట్ల తమ రాజీనామా ఫలితం ఊకే పోలేదని తాజా మాజీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం మంండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలుు ఇవ్వడం గెలుపొందిన తర్వాత హామీలనుు విస్మరించడం కెసిఆర్ కు కొత్త కాదని అన్నారు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజవర్గ అభివృద్ధి కోసం వందలసార్లు అపాయింట్మెంట్ కోరితే స్పందించని కెసిఆర్ రాజనామా చేస్తానని ప్రకటించక ముందేక మునుగోడు నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు తీస్తున్నాదంటే కేవలం తమ రాజీనామా పుణ్యమేనని నియోజవర్గ ప్రజలకు అర్థమైందని అన్నారు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వివక్షష చూపుతూ తమ ప్రాంతమైన సిరిసిల్ల , సిద్దిపేట , గజ్వేల్ ప్రాంత అభివృద్ధి పై ఉన్న ప్రేమ నల్గొండ జిల్లాపై ఎందుకు లేదని ప్రశ్నించారు తమను రాజకీయంగా ఎదుర్కోలేక తమపై అసత్యపు ప్రచారాలకు తెర లేపడం దారుణమని అన్నారు నల్లగొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తేతే మునుగోడు , దేవరకొండ , నల్లగొండ నియోజవర్గ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందేే అవకాశం ఈ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తిచేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్కు పేరు వస్తుందని నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నంత మాత్రాన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తయినట్లేేనా అని ప్రశ్నించారు తమ సొంత గ్రామంలోని చింతమడకలో 10 లక్షలు ప్రతిి కుటుంబానికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచినట్లేనా అవుతుందా అని అన్నారు మునుగోడు నియోజవర్గంలో 8 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశావని మునుగోడు నియోజకవర్గానికి అడుగుపెడుతున్నావో సమాధానం చెప్పి మునుగోడు కు రావాలని లేదంటే తమకు మునుగోడు అడుగుపెట్టే అర్హత లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ , రమేష్ రాథోడ్ , పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి , పాల్వాయి జితేందర్ రెడ్డి , మేకల ప్రమోద్ రెడ్డి , అయితగోని విజయ్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు