నిజాం పాలనను వ్యతిరేకించింది కమ్యూనిస్టులే
-పోసన బోయిన హుస్సేన్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 10(జనం సాక్షి): నిజాం పాలనను వ్యతిరేకించి ఎన్నో ఉద్యమాలు చేపట్టింది కమ్యూనిస్టులేనని సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హిందూ, ముస్లిం పోరాటముగా బిజెపి మతపరమైన సమస్యలను చిత్రీకరించి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. తెలంగాణలో ఇక మీ ఆటలు చెల్లవని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన నిలబడి ఎర్రజెండా చేతపట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిందన్నారు. ఆ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు అని లక్షల ఎకరాల భూమి పంచి పేద ప్రజల పక్షాన ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సిద్దిల వెంకటయ్య, మండల కమిటీ సభ్యులు చందాల భిక్షం, చీకూరు తిరపయ్య, మాధవరావు, వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.