నిజామాబాద్ ఎంపీకి ఘన స్వాగతం పలికిన మండల బీజేపీ నాయకులు.

నెరడిగొండ జులై28(జనంసాక్షి):
భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా గోస-బీజేపి భరోసా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ని నేరడిగోండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద గురువారం రోజున మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్ సోలంకి ప్రశాంత్ ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు నారాయణ బీజేపీ సీనియర్ నాయకులు తీగల నవీన్ పట్టణ అధ్యక్షుడు రాథోడ్ రాజశేఖర్ కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ భీంరావ్ ఓబిసి మోర్చ మండల కార్యదర్శి బొంతుకుల శ్రీను మండల నాయకులు రమేష్, సోలంకి నవీన్ శ్రీను సాయి తేజ మనోజ్ సుమన్ సచిన్ గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.