నిత్యావసర సరుకులు అందజేత
దండేపల్లి 16 .జనంసాక్షి గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ద్వారక ధర్మ రావు పేట గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వరద బారిన పడటంతో విషయం తెలుసుకొని అదే గ్రామానికి చెందిన కీర్తి శేషులు జోగిన పెళ్లి శంకరయ్య కీర్తిశేషులు ఏలుగూరి శేఖరయ్య కుటుంబ సభ్యులు వరద బారిన పడ్డ కుటుంబాలకు శనివారం 10 కిలోల బియ్యం తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను వారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బారిన ఇండ్లు నీటిలో మునగడంతో వారిని ఆదుకొని నిత్యవసర వస్తువులను ఇవ్వడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎలుగూరి వేణు తోపాటు జోగిన పెళ్లి శంకరయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు