నిమ్జ్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించాలి
ఝరాసంగం ఆగస్టు 22 (జనంసాక్షి) మండలం లోని ఎల్గోయి గ్రామంలో నిమ్జ్ భూ బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ పేరుతో అసైన్మెంట్ రైతులకు అతి తక్కువ పరిహారం చెల్లించి రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములు గుంజుకొని దళితులు, గిరిజలు,మైనార్టీ,పేదలను తీవ్రంగా మోసం చేసిందని అన్నారు. రైతులను మోసాగించడానికే ప్రభుత్వం123 జి. ఓ తెచ్చిందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు 2013 చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించిన నేటి వరకు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన చెప్పారు. రైతులకు2013 చట్టం ప్రకారం రావలసిన పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు భూమిలోకి రనిచేదే లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రైతులు, శంకర్,రాజు,యేసయ్య, అంజమ్మ,చంద్రయ్య, తో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




