నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం..
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
పాన్ గల్, జూలై 21( జనం సాక్షి)
నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి రైతులకు ఉచిత కరెంటు కోసం దాదాపు 12 వేలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని,సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసమే ఉచిత కరెంటు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తుందని,కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి 9వ విడత రైతుబంధు డబ్బులు కూడా రైతు ఖాతాలో జమ చేశారని, దళిత బంధు, రైతుబంధు ,రైతు బీమా, ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఆగస్టు నెల నుంచి కొత్తగా పింఛన్లు రేషన్ కార్డులు ఇండ్లు మంజూరు చేస్తారని తెలిపారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం పాల అనుబంధ ఉత్పత్తుల పైన జీఎస్టీ విధింపుకు నిరసనగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వనపర్తి లో ఒక మెడికల్ కాలేజ్ మరియు నాగర్ కర్నూల్ లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ గారికి దక్కుతుందని, ఎన్నో ఏళ్లుగా పాన్ గల్ మండలంలో డబుల్ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండే వారని ఇప్పుడు డబల్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు.
పాన్ గల్ మండల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉంటూ, మండలంలో ఎలాంటి త్రాగునీరు,సాగునీరు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు.తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చెందాలని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు జడ్పిటిసి లక్ష్మి శేఖర్ నాయక్, ఎంపీపీశ్రీధర్ రెడ్డి,,డిసిసిబి డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి , ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ యేసయ్య, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.